ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎంతకు వచ్చిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58 కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది బాధితులు మరణించారు. రాష్ట్రంలో ఇంకా 1,062 యాక్టివ్‌ కేసులు ఉండగా, 488 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదు అయినా కేసుల్లో కర్నూలులో అత్యధికంగా 30 ఉండగా, గుంటూరులో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురంలో 7, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి