సోషల్ మీడియా లో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే నారా లోకేష్..ఈరోజు శ్రీరామనవమి సందర్భాంగా ట్విట్టర్ లో దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని ట్వీట్ చేసాడు.
‘కరోనా నేపథ్యంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలసి సీతారాములను పూజించి వారి అనుగ్రహం పొందాలి. ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను మనం చూస్తున్నాం. అలాంటిది ప్రజల అభిప్రాయాలకు జీవితాన్ని మించి శ్రీరాముడు విలువ ఇచ్చాదు. అందుకే రామరాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించారు” ….అని లోకేశ్ ట్వీట్ చేశాడు.
ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీధుల్లోకి రాకుండా ఇంట్లోనే ఆ సీతారాములను పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. కరోనా మహమ్మారిని త్వరగా అంతం చేయమని రామచంద్రుని వేడుకోండి (2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 2, 2020
శ్రీరాముడంటే ఆదర్శం. ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజాభిప్రాయానికి విలువనివ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను మనం చూస్తున్నాం. అలాంటిది ఆనాడే ప్రజల అభిప్రాయాలకు జీవితాన్ని మించి విలువిచ్చాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించారు. (1/2) pic.twitter.com/ixQWUHebkr
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) April 2, 2020