కడప లో ఒక్క రోజే 15 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో జమాత్‌కు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతుండడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. నిన్నటివరకు వైఎస్సార్ కడప జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా వెలుగులోకి రాలేదు. కానీ ఈరోజు ఒక్క రోజే 15 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను భయానికి గురి చేస్తున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు జిల్లా నుంచి 59 మంది ఢిల్లీ వెళ్లినట్లు భావిస్తున్నారు. దీనిపై వివిధ ప్రాంతాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఏపీ లో 87 కు కరోనా కేసులు చేరాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో అధికంగా 13 కేసులు ఉ న్నాయి.. చిత్తూరు జిల్లాలో ఐదు.. ప్రకాశంలో మరో నాలుగు కేసులు పాజిటివ్ తేలాయి. నిన్నటి వరకు కడప, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాంటిది ఒక్కసారిగా రెండు జిల్లాల్లో కలిపి 28 కేసులు నమోదు కావడం సంచలనం రేపుతోంది.