Site icon TeluguMirchi.com

కరోనా విషయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు విపరీతం అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్‌ సరఫరా తదితర కీలక అంశాలపై చర్చించారు.

ఇక అన్ని జిల్లాల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్ని వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాలేజీలు, ఆస్పత్రులు కలెక్టర్ల ఆదీనంలో పనిచేయాలని.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ల్యాబ్‌లు, వార్డులు ఉపయోగించుకోవాలని.. మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది సాయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

అధికారుల్ని అడిగి కరోనా వైరస్‌ వ్యాప్తి, నివారణ చర్యలపై ఆరా తీశారు. ఇక లాక్‌డౌన్‌ వెలుసుబాటు సమయాన్ని తగ్గించగా.. అది అమలు అవుతున్న తీరుపై సీఎం సమీక్ష చేశారు. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్న జిల్లాల్లో తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

Exit mobile version