Site icon TeluguMirchi.com

లాక్ డౌన్ ఎత్తివేయడం ఫై జగన్ ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతం కావడం తో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అధికారులతో సమీక్షా నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసరాల పంపిణీ, కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు మొదలువాటిపై అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జగన్ మాట్లాడుతూ..ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని .. కరోనా సంబంధిత లక్షణాలతో ఎవరొచ్చినా.. కోవిడ్‌ బాధితుడిగానే భావించి ఆ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారితో కాంటాక్ట్ అయిన వారికి వీలైనంత వేగంగా పరీక్షలు పూర్తి చేయాలని .. ప్రతి జిల్లాలో ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. ఇక లాక్ డౌన్ పొడిగింపుపై జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్‌ 14వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version