ఏపీలో కరోనా కేసులు పెరగడానికి ఢిల్లీ ప్రార్థనలే కారణం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులు పెరగడానికి కారణం ఢిల్లీ ప్రార్థనలే అని జగన్ తెలిపారు. బుధువారం మీడియా సమావేశం ఏర్పటు చేసిన జగన్ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగినట్లు తెలిపారు. వారిని, వారితో కాంటాక్ట‌లో ఉన్నవారిని గుర్తించే పని చేస్తున్నామని సీఎం తెలిపారు. వైరస్ విషయమై భయాందోళనలకు గురి కావొద్దన్నారు. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనన్న జగన్.. వయసు మీద పడిన వారు, శ్వాస సంబంధ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రభావం చూపుతుందన్నారు.

మన రాష్ట్రం నుంచి దాదాపు 1085 మంది ఢిల్లీ సదస్సుకు వెళ్లారన్న సీఎం.. అందులో 585 మందికి పరీక్షలు చేశామని.. 70 కేసులు పాజిటివ్‌గా తేలాయన్నారు. మరో 500 మంది రిపోర్టు రావాల్సి ఉందన్నారు. మరో 21 మంది జాడ తెలియాల్సి ఉందన్నారు. వీళ్లుగానీ, వీళ్ల కుటుంబ సభ్యులు గానీ, వీళ్లతో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.