కరోనా బాధితులు నేరస్థులు కాదు – జగన్

కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 200 కేసులు దాటగా..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 కు దగ్గరగా ఉంది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగన్ మీడియా సమావేశం ఏర్పటు చేసారు.

ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని..కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. కరోనా బాధితులను నేరస్థులుగా చూడకూడదన్నారు. కరోనా బాధితులపై అప్యాయత చూపాలని జగన్ చెప్పారు. కరోనా కాటుకు కులమతాలు లేవన్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు అందరూ కులమతాలకు అతీతంగా దీపాలు వెలిగించాలని, అందరూ ఒకటే అనే ఐక్యతను చాటాలని జగన్ తెలిపారు. ఒక మతాన్నో, వర్గాన్నో, లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. కరోనా కాటుకు కులాలు, మతాలు, ప్రాంతాలు లేవని చెప్పారు. మన ఐక్యతను దేశానికి, ప్రపంచానికి చాటి చెబుతామని జగన్ తెలిపారు. ప్రధాని పిలుపు మేరకు లైట్లు ఆఫ్ చేద్దామని జగన్ పిలుపునిచ్చారు.