Site icon TeluguMirchi.com

జగన్ ఆరు రోజుల్లోనే ఆలా అనిపించుకున్నాడేంటి..

కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది మాములు విషయం కాదు..రాష్ట్ర పరిస్థితులు..పాలనా విధానాలు..ప్రభుత్వ నిధులు..శాఖల పనితీరు ఇవన్నీ తెలుసుకోవడానికే నెలలు పడుతాయి. వాటిని తెలుసుకొని..అభివృద్ధి మొదలు పెట్టాలంటే ఇంకాస్త సమయమే పడుతుంది. కానీ జగన్ మోహన్ రెడ్డి కి ఆలా కాదు కేవలం ఆరు రోజుల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకున్నారు. ప్రమాణ స్వీకారం రోజు ఆరు నెలలో బెస్ట్ సీఎం అనిపించుకుంటాను..అని చెప్పిన జగన్..ఆరు నెలలు కాదు కేవలం అరంటే ఆరు రోజుల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుని సరిలేరు నీకెవ్వరు అని పిలిపించుకుంటున్నాడు.

జగన్ జెట్ స్పీడ్ తో వెళ్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి. తాను తీసుకునే నిర్ణయాలే కాదు, వాటిని అమలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే.. జగన్ కి సరిలేరు నీకెవ్వరు అనకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. నవరత్నాలను ఎలా అమలు చేస్తారో చూస్తాం అంటూ సెటైర్లు వేసినవారు కూడా… నవరత్నాలే కాదు.. మేనిఫెస్టోలో లేని హామీల్ని కూడా అమలు చేస్తున్న జగన్ ని చూసి షాకవుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం 3వేలకు పెంపు, ఆశావర్కర్ల జీతం 10వేలకు పెంపు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు పూర్తిగా 12నెలల వేతనం.. ఇలా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఆయన ఇమేజ్ ని జనాల్లో డబుల్, ట్రిపుల్ చేస్తున్నాయి.

పించన్ల పెంపు వచ్చే నెల నుంచి అమలులోకి వస్తోంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు కోసం ప్రత్యేక దృష్టిపెట్టారు జగన్. ఇలా.. రోజువారీ సమీక్షలు చేస్తూనే.. పాదయాత్రలో తానిచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇక ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి చేస్తాడు చెప్పండి అంటూ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే ఒక్కే ఒక్కడు జగన్ అని సినిమా డైలాగ్స్ చెపుతున్నారు .

Exit mobile version