Site icon TeluguMirchi.com

ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తున్న ఏపీ సర్కార్

కరోనా కట్టడి లో భాగంగా ఏపీ సర్కార్ ఫ్రీ గా మాస్క్ లు పంపిణి చేస్తుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాలకు గాను 1.43 కోట్ల కుటుంబాలపై మూడో విడత సర్వే పూర్తి అయ్యింది.

ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు 32,349 మందిని వైద్యాధికారులకు రిఫర్‌చేశారు. వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని మెడికల్ ఆఫీసర్లు నిర్ధారించారు. అయితే, మొత్తం 32,349 మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు కోవిడ్‌ 19 కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45వేల పరీక్షలకు సిద్ధమవుతోంది వైద్య శాఖ. వైరస్‌ వ్యాప్తి, ఉద్ధృతిని అంచనా వేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని సీఎంకు వెల్లడించారు. కోవిడ్‌ 19 వ్యాప్తి ఉన్నజోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని అధికారులు చెప్పారు.

Exit mobile version