Site icon TeluguMirchi.com

మద్యం సీసాలతో అడ్డంగా దొరికిపోయిన సీఐ

కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.

ఇదిలా ఉంటె ఎక్కడైనా మద్యం అమ్మకాలు జరిగితే పట్టుకోవాల్సిన సీఐ తన కారులో మద్యం సీసాలతో తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ సీఐ త్రినాథ్ చేసిన పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్సైజ్‌ సీఐ రెడ్డి త్రినాథ్‌‌ పై సస్పెన్షన్‌ వేటు వేయడమే కాకుండా, రూ.5 లక్షల జరిమానా విధించినట్లు డీప్యూటి సీఎం నారాయణ స్వామి తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version