Site icon TeluguMirchi.com

టీడీపీ సీనియర్ నేత ఇంట్లో విషాదం

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి ప్రభావతి శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో బుద్ధ ప్రసాద్ తల్లి ప్రభావతి తుది శ్వాస విడిచారు. హనుమాన్ జంక్షన్‌లో తన కూతురి ఇంటికి వెళ్లిన ప్రభావతి.. అక్కడే కన్నుమూశారు. ప్రభావతి మరణంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుద్ద ప్రసాద్‌ను ఫోన్‌లో పరామర్శించారు.

వెంకట కృష్ణారావు సతీమణి ప్రభావతి ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఆయన 1997లో చనిపోగా.. ఆయన వారుసుడిగా బుద్ధ ప్రసాద్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆయన అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు.

Exit mobile version