కరోనాపై పోరాటానికి ఏపీ గవర్నర్ సాయం

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్న వేళ..ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ సైతం కరోనాపై యుద్ధానికి తన వంతు సాయం ప్రకటించారు.

కరోనా నివారణ చర్యల కోసం ప్రధాన మంత్రి కేర్స్ నిధికి ఒక నెల జీతంతో పాటు ఏపీ సీఎం సహాయ నిధికి రూ. లక్ష విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఉదారంగా విరాళాలు అందజేసి కరోనాపై పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు గవర్నర్. లాక్‌డౌన్‌ను పాటించి.. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.