Site icon TeluguMirchi.com

క్వారంటైన్ సెంటర్ పై రాళ్లదాడి..గుత్తి లో ఉద్రక్తత

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించిన వారికీ చికిత్స అందిస్తున్నారు. అలాగే అనుమానితులను క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే కొంతమంది అనుమానితులు మాకు ఏమి లేకుండా మమ్మలను క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతున్నారని దాడికి దిగుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుత్తి లో చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీకృష్ణదేవరాయల ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలోనూ అలంటి ఘటనే చోటు చేసుకుంది. గుత్తి SKD కాలేజీ క్వారంటెన్‌లో ఉన్న మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కూలీలు తమకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ధ్రువీకరించినప్పటికీ సొంత గ్రామాలకు పంపడం లేదని అధికారులతో వాదనకు దిగారు. తమను ఇళ్లకు పంపించేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వలసకూలీలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ కూలీలు క్వారంటైన్ సెంటర్ పై రాళ్ల దాడి చేసారు. గుత్తి సీఐతో పాటు ఇద్దరు హోంగార్డులకు స్వల్ప గాయాలయ్యాయి.

Exit mobile version