Site icon TeluguMirchi.com

ఏపీలో లాక్ డౌన్ ఎత్తేస్తారా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడి లో భాగంగా ప్రధాని మోడీ 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 నాటికీ ముగియనుంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ప్రజలు లాక్ డౌన్ కొనసాగిస్తారా లేక ఎత్తేస్తారా అనేదానిగురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూసి చాలామంది ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిదనే నిర్ణయానికి రావడం , మోడీ చెప్పడం జరిగింది.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్ ఇంకా దీనిపై ఎలాంటి స్పందన తెలుపడం లేదు. కరోనా కారణంగా ఈ నెల 14 వరకు కేంద్రం విధించిన లాక్ డౌన్‌ను పొడగించాల్సిందే అని తెలంగాణ సీఎం కేసీఆర్ తెగేసి చెబుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఇంతకుమించిన మార్గం లేదనే కేసీఆర్ పదే పదే స్పష్టం చేస్తున్నారు.

ఇదే విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లోనూ స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాత్రం కరోనా ఫ్రీ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేయాలని ప్రధానికి సూచించారు. కరోనా హాట్ స్పాట్లు, రెడ్ జోన్లలో లాక్ డౌన్ కొనసాగించి… కరోనా వ్యాప్తి లేని ప్రాంతాలను లాక్ డౌన్ నుంచి మినహాయించాలని ఆయన కోరారు.

దీంతో లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో జగన్ వైఖరి కూడా ఇదేననే ప్రచారం జరుగుతోంది. ఏపీలోని అనేక జిల్లాలో కరోనా వ్యాప్తి ఉంది. అయితే జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా వ్యాప్తి లేదు. దీంతో సీఎం జగన్ కరోనా ఫ్రీ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తి వేయాలనే యోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇదే ఫైనల్ చేస్తాడా లేక అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ కొనసాగిస్తారా అనేది చూడాలి.

Exit mobile version