ఆంధ్రప్రదేశ్ లో 21 కి చేరిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 21 కేసులు నమోదు కాగా.. అందులో ఈరోజు రెండు కేసులు పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖా తెలిపింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

ఇవాళ మంత్రులతో సీఎం జగన్ కరోనా పరిస్ధితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. లాక్ డౌన్ సమయంలోనూ కేసులు పెరుగుతుండడంతో.. మరిన్ని నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. పట్టణాలు, నగరాల్లో నిత్యవసరాల కొనుగోలుకు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటలవరకూ సమయమిచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిత్యవసరాలు కొనుగోలు చేయవచ్చని చెప్పుకొచ్చారు. ప్రతీ దుకాణం దగ్గర పట్టికలు ప్రదర్శించాలని సూచించారు. అదే విధంగా రేషన్ దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు