ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు, బడ్జెట్‌లో కనీసం ప్రాముఖ్యత ఇవ్వకుండా, కొత్త రాష్ట్రం గురించి మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు అంటూ టీడీపీ మరియు వైకాపా ఎంపీలు తీవ్ర స్థాయిలో పార్లమెంటులో ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సమయంలోనే ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని, అప్పుడు కాని మోడీ అండ్ కోపై ఒత్తిడి పెరుగుతుందని సలహా ఇస్తున్నారు. అయితే రాజీనామా అనేది ఎలాంటి ప్రతిఫలం చూపించదని, రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చి, మళ్లీ వారే గెలుస్తారు.
ప్రయోజనం ఉండదని, మోడీ ప్రభుత్వంకు వచ్చిన ఢోకా ఏమీ లేదు కనుక రాజీనామా చేస్తామన్నా కూడా వాటిని వెంటనే అంగీకరించేలా స్పీకర్‌ను మోడీ ఒత్తిడి చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అందుకే రాజీనామా నిర్ణయం కాకుండా మరేరకంగా అయినా ప్రత్యేక హోదా మరియు ఏపీ అభివృద్దికి ఎంపీు ప్రయత్నాు చేయాల్సి ఉంది. మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేస్తే ఆర్థిక భారం తప్ప మరేం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.