ఇంట్లోనే అసమ్మతి!

anamరాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన సోదరుడు జయకుమార్ రెడ్డి తప్పు పట్టారు. తాజాగా జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖరరెడ్డి దయ వల్లనే తమ కుటుంబం ఈ స్ధాయికి ఎదగ గలిగిందని బహిరంగంగానే ప్రకటించారు. తన అన్నలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి రాజకీయ ఎదుగుదలకు వైఎస్ ఎంతో సహాయం చేశారని వెల్లడించారు. వైఎస్‌తో లబ్ది పొందిన వారిలో మొదటివారు తమ అన్నలే అని, వివేకానందరెడ్డి రాజకీయంగా ముందుకు రావటానికి వైఎస్ చలువే కారణం అని స్పష్టం చేశారు.