గ్యాస్ లీక్ ఘటన అమిత్ షా ఏమన్నాడంటే..

విశాఖ పట్నం లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన లీకైన విషవాయువు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటికే ఈ విష వాయువు కారణంగా ఎనిమిది మంది మరణించగా..వందలమంది స్పృహ లేకుండా హాస్పటల్ లలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన పట్ల ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు స్పందించగా..

కేంద్రం హోం శాఖా మంత్రి అమిత్ షా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ‘విశాఖ ఘటన నా మనసును కలిచి వేసింది. విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాను. మొత్తం వ్యవహారాన్ని మానిటర్ చేస్తున్నాం. బాధితులు అంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ఇదివరకే ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించడం జరిగింది.