నాగాలాండ్‌ కాల్పులపై లోక్ సభ లో వివరణ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు లోక్‌సభలో వివరణ ఇచ్చారు

ఓటింగ్‌, మోన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. దీంతో డిసెంబరు 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్‌ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత డిసెంబరు 5 సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్‌ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్‌ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. సైన్యం పొరబాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందని ఘటనపై సిట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.