అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం ఇదే.. అక్కడి ఎన్నికల తీరే ప్రత్యేకం

అమెరికాలో ఎన్నికలు జరిగే తీరే ప్రత్యేకం. అత్యధిక ఓట్లు సాధించినా పీఠం ఎక్కేది ఎవరో చెప్పలేం. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అధికార మార్పిడికి, కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే విజేత. కానీ అమెరికాలో ఎన్నికల్లో గెలవడమే కాదు. చాలా అంశాలు అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయిస్తాయి. అందుకు గత ఎన్నికలే ఉదాహరణ. గత ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ అధ్యక్ష రేసులో నిలిచారు. ప్రజలందరూ హిల్లరీ క్లింటన్ కే మద్దతిచ్చారు. ట్రంప్ అధికారంలోకి రావడమే వాళ్ళకు ఇష్టం లేదు. ట్రంప్ అధ్యక్షుడిగా వద్దంటూ ఆందోళనలు కూడా నిర్వహించారు. కానీ ప్రజా మద్దతుతో సంబంధం లేకుండా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఎన్నికలు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. దానికంటూ ఎప్పటికీ ఒక ఫిక్స్ డ్ ఉంటుంది. ప్రతి నవంబరు మొదటి సోమవారం తరువాత మొదటి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. సాధారణంగా 3వ తేదీకి అటూ ఇటూగానే ఎన్నికలు ఉంటాయి. మన దేశంలో అయితే లెక్కలేని పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం. ఒకవేళ మెజార్టీ రాకపోయినా ఇతర ఇతర పార్టీలతో జట్టు కట్టి అధికారం పొందుతుంటారు.

అమెరికాలో అలా కాదు అక్కడ కేవలం రెండు పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఆ రెండు పార్టీలలోని ఓ వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నిక అవుతారు. ఇక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీలు రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ఈసారి రిపబ్లికన్ పార్టీ తరఫున మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు అత్యధిక ఓట్లు సాధిస్తారో వాళ్లే అధికారం చేపడతారని లేదు. ఎలక్ట్రోరల్ ఓట్ల లో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారే విజేతలు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి. ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా వీటిని నిర్ధారిస్తారు. అమెరికాలో 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా, 270 కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓటు సాధించినవారు విజేతలవుతారు. రెండు రాష్ట్రాల్లో మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ‘విన్నర్స్ టేక్స్ ఆల్’ అనే నిబంధన కింద ఓటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ఎక్కువ ఓట్లు సాధిస్తారో ఆ వ్యక్తికి రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లను కేటాయించడం జరుగుతుంది. సాధారణంగా ఎన్నికలంటే ప్రజలంతా తలా ఒక పార్టీ వైపు చీలి ఓటు వేస్తుంటారు. అమెరికాలో అలా కాదు.. ఎన్నికలనగానే ప్రజలు కచ్చితంగా ఒక పార్టీ వైపే మొగ్గు చూపుతారు. ఒక పార్టీ కనీసం పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు పొందగలిగితే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి రాష్ట్రాలను ‘బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ‘అని పిలుస్తారు.

18 సంవత్సరాలు నిండిన ఎవరైనా అమెరికా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సాధిస్తారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం గుర్తింపుకార్డులు చూపడంతో సహా పలు నిబంధనలు విధించాయి. ఇలాంటి నిబంధనలు ఎక్కువగా డిమాండ్ చేసేది రిపబ్లికన్ పార్టీ. ఓటింగ్ సమయంలో అక్రమాలు జరగకూడదని ఆ పార్టీ ఉద్దేశం. ఓటింగ్ వేసే సమయంలో గుర్తింపు కార్డులు చూపాలం టూ ఒత్తిడి తెస్తే పేదలు, సాధారణ ప్రజలు ఓటింగ్ కు దూరంగా అవుతారని డెమోక్రటిక్ పార్టీ వాదన. అమెరికాలో చాలా మంది ఖైదీలకు ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళు విడుదలైన తర్వాతే ఓటు హక్కు పొందుతారు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం ఖైదీలకు ప్రత్యేకంగా ఓటేసే అవకాశం కల్పించాయి. అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటు వేసే వారు ఎక్కువే. అయితే గత ఎన్నికల ఎన్నికల సమయంలో మాత్రం 21 శాతం మంది పోస్ట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈసారి కరోనా కారణంగా పోస్టల్ ఓట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెంచాలని చాలా మంది రాజకీయ నాయకులు సూచిస్తున్నారు. కానీ ఈ పద్ధతిని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం ద్వారా అక్రమాలు జరిగే అవకాశం ఉందనేది ఆయన వాదన. అమెరికాలో డెమోక్రాట్లకు ప్రతినిధుల సభ పై పట్టుంది. ఈసారి కూడా తమ పట్టును కొనసాగిస్తూనే సెనేట్ ను కూడా తమ చేతుల్లోకి తీసుకోవాలని వారు భావిస్తున్నారు. రెండింటి మీద పట్టు సాధిస్తే ట్రంప్ గెలిచినా ఆయన నిర్ణయాలను ఆపడం, ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. మనకు ఎన్నికలు జరిగిన వారం పది రోజులకు ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు కొలువుదీరుతుంటాయి. కానీ అమెరికాలో అధికారం చేపట్టడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఎన్నికల ట్రెండ్స్ ను బట్టి విజేత ఎవరో ముందే తెలుస్తుంది.

ఈసారి కరోనా కారణంగా పోస్టల్ బ్యాలెట్లు పెరిగే అవకాశం ఉండడంతో లెక్కించడానికి సమయం పడుతుంది కాబట్టి ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో అధికారం మారిన అప్పటికప్పుడు వెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోవడానికి అవకాశం లేదు. అధికార మార్పిడికి కొంత సమయం తీసుకుంటారు. ఆ లోగా గెలిచిన అభ్యర్థి కేబినెట్ మినిస్టర్ల ఎంపికతో పాటు అధికారం చేపట్టగానే చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా జనవరి 20న ప్రమాణం చేస్తారు. వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్ సిటీ మెట్లమీద అధ్యక్షుడి ప్రమాణం ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రవేశిస్తారు.