అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సీఐఏ వినూత్న ప్రకటన


ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీగా సీఐఏ అనే పేరు అందరికీ తెలిసిన విషయమే. సీఐఏ ఏజెంట్లు విదేశాల్లో గూఢాచారులుగా పనిచేస్తూ ఉగ్రవాదులు, అలాగే తమ దేశానికి పొంచి ఉన్న అనేక ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ ఉంటారు. అయితే తాజాగా సీఐఏ తమకు గూఢచారులు కావాలని లింకిడిన్ వెబ్ సైట్ లో ఒక అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. మరీ ఇంత బహిరంగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సీక్రెట్ ఏజెన్సీలో పనిచేయడానికి ప్రకటన ఇలా కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా సీఐఏ ఏజెంట్ల నియామకం చాలా గోప్యంగా జరుగుతుంది. అయితే ఈసారి అమెరికా వినూత్న పద్ధతుల ద్వారా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తమకు పని చేయడానికి ఇరాన్, చైనా, ఉత్తర కొరియాల్లో ఏజెంట్ల అవసరం ఉందని తెలిపింది. ఈ ప్రకటన చూసిన తర్వాత చాలామంది తాము పని చేస్తామంటూ ముందుకు వస్తున్నారు.