హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో సిబ్బంది మరియు ప్రయాణికులు కొద్ది సేపు బాంబు భయంతో భయబ్రాంతులకు గురయ్యారు, ఈ ఘటన మంగళవారం ఉదయం SR నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది చెత్త డబ్బాలోని మొబైల్ ఫోన్ వైబ్రేషన్‌ని బాంబుగా భావించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో SR నగర్ పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో పాటు మెట్రో స్టేషన్‌కు చేరుకుని స్నిఫర్ డాగ్‌ల సహాయంతో స్టేషన్‌ను తనిఖీ చేశారు. చెత్త డబ్బాలో మొబైల్ ఫోన్ కనిపించడంతో మెట్రో సిబ్బంది మరియు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొబైల్ ఫోన్ పని చేయకపోవడంతో ఎవరో ఆ మొబైల్ ని చెత్తబుట్టలో పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.