తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నిన్న ప్రకటించాడు. అయితే దీని వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు తనదైన స్టైల్ లో చంద్రబాబు నాయుడు పై సెటైర్లు వేసాడు . ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తే తప్పేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని నిలదీశారు. ఓటమి భయంతోనే టీడీపీ ‘పరిషత్’ ఎన్నికలను బహిష్కరిస్తోంది. ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేక పలాయనం చిత్తగిస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటాలు చేస్తాననడం విడ్డూరంగా ఉంది.ఎన్నికల బహిష్కరణకు చంద్రబాబు చెబుతున్న కారణాలు విడ్డూరంగా ఉన్నాయి అని కౌంటర్ వేశారు.