తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆహ్వానం అందించారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సుబ్బారెడ్డి ఆలయ వివరాలను తెలిపారు.ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు,9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.గవర్నర్ కు స్వామివారి కార్యక్రమ ఆహ్వాన పత్రిక, ప్రసాదాలు అందజేసారు