ఆ ఛానెల్ తీరుతో అమరావతి రైతు ఉద్యమానికి తీరని నష్టం జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.మొదట్లో ఉద్యమం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేదని,కానీ ఆ ఛానెల్ ఎంట్రీ తర్వాత ఉద్యమం కేవలం స్వార్థ పూరిత వ్యక్తుల ప్రయోజనాల కోసమే నడుస్తున్నట్లు ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని అమరావతి రైతుల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.దీంతో ఉద్యమానికి మొదటికే మోసం వస్తుందని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ & కమ్మ వర్గంలో కొంతమంది ఉద్యమాన్నివెనుక నుండి దగ్గరుండి నడిపిస్తున్నారని ,అది అమరావతి కాదని కమ్మరావతి అని అధికార వైసీపీ పదేపదే విమర్శలు గుప్పించడంపాటు ,అది అసలు రైతుల ఉద్యమం కాదని ,పెయిడ్ ఆర్టిస్టులతో నడిపిస్తున్నారని వైసీపీ ప్రచారం చేయడంతో తమకి ఇబ్బందిగా మారిందని తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు.
దీనికి తోడు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గ మైన ఆ ఛానెల్ చైర్మైన్ ఏకంగా వెళ్లి అమరావతి రైతులతో కలిసి చర్చలు జరిపి,స్వయంగా పాల్గొనడం వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఉద్యమాన్ని మొత్తం ఆ ఛానెల్ స్వయంగా తన భుజస్కందాలతో మోస్తునట్లు ,వార్తలు ప్రసారం చేస్తూ వారికి నచ్చిన వారిని మాత్రమే హైలైట్ చేస్తూ, ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేయించుకుంటుందని ,నిజమైన ఉద్యమకారులను పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.అంతేకాక అర్థం పర్థం లేని డిబేట్లు పెడుతూ, ఆ డిబేట్లలో సైతం ప్రతిరోజూ ఒకే వ్యక్తులను ,తమకి అనుకూలమైన వారిని పెట్టడంతో ఉద్యమానికి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయేలా చేసిందనుకుంటున్నారు.దీనికి తోడూ ఇష్టారీతిన విశ్లేషణలు సాగిస్తూ ఉద్యమం పట్ల ప్రజల్లో అనాసక్తి పెరగడానికి ముఖ్య కారణమయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇది ఇలాగే కొనసాగితే ఉద్యమానికి తీవ్ర నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.తమకు ఆ ఛానెల్ తో లాభం కన్నా,నష్టమే ఎక్కువుందని భావించిన అమరావతి రైతులు వీలైనంత వరకు ఆ ఛానెల్ ను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యినట్టు టాక్.