Site icon TeluguMirchi.com

ఏపీ కేసులు తగ్గాయి: ఆళ్ల నాని


కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఇప్పటి వరకు ‘కరోనా’ నుంచి కోలుకుని 488 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా పరీక్షల సామర్థ్యం మరింత పెంచామని అన్నారు.

వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 పడకలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బెడ్స్ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిబంధనలు సడలించే అవకాశం ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Exit mobile version