తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్‌లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు. కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
Home వార్తలు ఆంద్రప్రదేశ్ వార్తలు ఇంటర్ కాలేజీలో 163 మంది విద్యార్థులకు కరోనా, మంత్రి ఆళ్ల నాని స్పందన