బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై నేడు అఖిలపక్షం

all-party-meetingముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు (మంగళవారం) అఖిలపక్ష సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈరోజు ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. కృష్ణా మిగులు జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తుది తీర్పుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలిగించేలా వున్న తాజా తీర్పపై .. ప్రభుత్వ పరంగా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అఖిలపక్షంలో వచ్చిన అభిప్రాయాన్ని బట్టి ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం కలిగించే ఈ తీర్పపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా తో ఫాటుగా ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిలను కలసి అవకాశం వున్నట్లు తెలుస్తోంది.