తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేశారు. అలీ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వైసీపీలో చేరింది పదవుల కోసం కాదని, జగన్ ను సీఎం
చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరానని తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానం ముఖ్యమన్నారు.