అళగిరి అలక..!

Alagiri-DMKడీఎంకేలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కులపై యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టే అంశాలపై చర్చించడానికి పార్టీ కార్యవర్గం ఈరోజు (సోమవారం) ఉదయం భేటీ అయింది. అయితే ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత అళగిరి గైర్హాజరయ్యారు. డిఎంకె అధినేత కరుణానిధి కొద్దిరోజుల క్రితం రాజకీయ వారసునిగా తన తరవాత స్థానం స్టాలిన్ అని ప్రకటించన నేపథ్యంలో.. అళగిరి, స్టాలిన్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని తెలుస్తోంది.  కాగా, గత వారం శ్రీలంక తమిళుల విషయంలో యూపీఏ వ్యవహరించిన తీరుకు నిరసనగా.. డీఎంకే యూపీ ఏకు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. డీఎంకేకు చెందిన అయిదుగురు మంత్రులు ప్రధానికి రాజీనామ సమర్పించే విషయంలో కూడా అళగిరి పార్టీనేతలతో కాకుండా విడిగా వెళ్లి ప్రధానికి తన రాజీనామాను సమర్పించారు. అయితే తాజాగా ఈరోజు పార్టీకార్యవర్గ సమావేశానికి అళగిరి డుమ్మాకొట్టడం ద్వారా డీఎంకే లో మరోసారి ఆధిపత్యపోరు స్పష్టంగా బయపడిందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.