Site icon TeluguMirchi.com

డీఎంకే ‘మఠం’ కాదు : ఆళగిరి

alagiriడీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయవారసుడు స్టాలిన్  అని ఇచ్చిన సంకేతాలు మరోసారి కలకలం సృష్టించాయి. తన తర్వాత కుమారుడు స్టాలినే వారసుడని ప్రకటించడానికి డీఎంకే ‘మఠం’ కాదని కరుణానిధి మరో కుమారుడు, కేంద్రమంత్రి ఆళగిరి విలేకరులతో పేర్కొన్నారు. ఆళగిరి విమానాశ్రయంలో మాట్లాడుతూ… డీఎంకే… శంకరమఠం కాదని కరుణానిధే గతంలో పలుమార్లు ప్రస్తావించారని గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా కరుణానిధి తప్ప మరోవ్యక్తిని ప్రతిపాదించే ప్రసక్తే లేదని ఆళగిరి గతంలోనూ పలుమార్లు స్పష్టం చేశారు.

Exit mobile version