రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా లలితారాఘవేందర్ !

akula-laitha-ragavendarరాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కొత్త నేత ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆకుల లలితారాఘవేందర్ ను రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఆ పార్టీ ఎంపిక చేసింది. ఈ మధ్యాహ్నం గాంధీభవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లలితా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆమె నిజామాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఈ పదవీ బాధ్యతల స్వీకారోత్సవానికి జాతీయ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనితా వర్మ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పీసీసీ మాజీ చీప్ డి.శ్రీనివాస్, సీనియర్ నేత షబ్బీర్ అలీ, మహిళానేత గంగాభవాని తదితరులు హాజరయ్యారు.