Site icon TeluguMirchi.com

అక్బరుద్దీన్ పిటిషన్ కొట్టివేత

Akbaruddin-Owaisi-Arrestతాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, మెరుగైన వైద్యం కోసం చంచల్ గూడ జైలుకు తరలించాలని ఎంఐఎం అక్బరుద్దీన్ పెట్టుకున్న పిటిషన్ ను నిర్మల్ కోర్టు కొట్టివేసింది. అక్బరుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదిలాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ను కోర్టు ఆదేశించింది.

మరోవైపు అక్బరుద్దీన్ ను వారం పాటు తమ కస్టడీకి ఇవ్వాలన్న నిర్మల్ పోలీసుల పిటిషన్ పై విచారణ గురువారంకు  వాయిదా పడింది. పోలీసుల పిటిషన్ పై రేపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు అక్బరుద్దీన్ ను ఆదేశించింది. అదిలాబాద్ నిర్మల్ బహిరంగ సభలో మతవిద్వేశాలను రెచ్చగొట్టే విధంగా చేసిన ఉపన్యాసాల నేపథ్యంలో అక్బరుద్దీన్ పై కేసు నమోదయి నిన్న పోలీసులు అరెస్ట్ చేసి నిర్మల్ కు పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలిసిందే.

Exit mobile version