Site icon TeluguMirchi.com

హిందువులందరినీ చంపేస్తారా?

akbaruddin owaisi“అక్బరుద్దీన్ ఓవైసీ కోరుకున్నట్లు పదిహేను నిమిషాలు కాదు… ఏకంగా ఓ గంటపాటు పోలీసు యంత్రాంగాన్ని తప్పుకోమని చెబుతాం… హిందువులందరినీ చంపేస్తారా?” ఇది అక్బర్ పిటిషన్ ను విచారిస్తున్న జస్టిస్ ఎల్. నరసింహారెడ్డిలో కనిపించిన ఆవేశం జోరు. అక్బరుద్దీన్ చేసిన హేట్ స్పీచ్ తదనంతరం రాష్ర్ట వ్యాప్తంగా పలుచోట్ల నమోదైన కేసులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి విచారణ చేపట్టవలసిందిగా అభ్యర్థిస్తూ.. అక్బర్ తన న్యాయవాదుల ద్వారా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారిస్తున్న
బెంచ్ లో జస్టిస్ నరసింహారెడ్డి, జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులు. సదరు పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆగ్రహంతో పలు ప్రశ్నలతో అక్బర్ న్యాయవాదులపై విరుచుకుపడ్డారు.

అక్బర్ తండ్రి ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాడని, తన హయాంలో ఇద్దరు హిందువులను సైతం ఏకంగా నగర మేయర్ వంటి అత్యుత్యమ పదవుల్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. ఓవైసీ కుటుంబాన్ని తమ దేశస్తులుగా అత్యున్నత స్థానాన్ని కల్పించి గౌరవించిన సాటి భారతీయులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. అక్బర్ చేసిన ప్రసంగాన్ని తాము కూడా చూసామని, తన మాతృదేశం గురించి ఇలా మాట్లాడారేమిటి అంటూ నిలదీశారు. హిందువుల ఆరాధ్యదైవం అయిన శ్రీరామ చంద్రుడిపై విమర్శలు చేసిన అక్బర్ మళ్ళీ చివరికి అదే రామున్ని పూజించే సీతారామమూర్తి, రామచంద్ర రాజులను తనను కాపాడాటానికి నియమించుకోవలసి వచ్చిన సంగతి కూడా గుర్తుంచుకోవాలని సూచించారు.

Exit mobile version