Site icon TeluguMirchi.com

కరోనా ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినా ఎమ్మెల్యే..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా లో కరోనా ఫై ఎవరైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా ఫై వివాదస్పద వ్యాఖ్యలు చేసి దేశద్రోహం కింద అరెస్ట్ అయ్యాడు ఏఐడీయూఎఫ్‌ ఎమ్మెల్యే.

వివరాల్లోకి వెళ్తే ..ఆలిండియా యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్‌) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ మరో వ్యక్తితో కలిసి క్వారంటైన్ సెంటర్ల గురించి మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి వైరల్ బయటకు వచ్చింది. అందులో ఆయన క్వారంటైన్ సెంటర్లను నిర్భంద కేంద్రాలు అని, చాలా ప్రమాదకరమైనవి అని అన్నట్లు మాట్లాడాడు.

అలాగే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా అమినుల్ విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ సర్కార్ ముస్లిం పట్ల వివక్ష చూపుతోందని ఆయన అన్నారు. తబ్లిగీ జమాత్‌లో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారితో వైద్య సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి సైతం కావాలనే ఇంజక్షన్లు ఇచ్చి.. వారిని కరోనా వ్యాధి ఉన్నవారిలా చిత్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అమినుల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయన్ను అరెస్ట్ చేశారు.

Exit mobile version