కేంద్ర మంత్రులు నితీష్ గడ్కరీ, Dr. భారతీ పవార్ అధ్యక్షతన ఎయిమ్స్ నాగపూర్ 3 వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి నితీష్ గడ్కరీ మాట్లాడుతూ… ఎయిమ్స్ నాగపూర్ మహారాష్ట్ర మాత్రమే కాకుండా మధ్య భారతదేశంలోని అన్ని సరిహద్దు రాష్ట్రాల రోగులకు ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది అని అన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ఒక విధానానికి రూపకల్పన చేసింది అని Dr. భారతీ పవార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, నాగపూర్ ఎయిమ్స్ అధ్యక్షుడు డాక్టర్ దావే, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విభా దుత్త సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.