తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృభిస్తుందో తెలియంది కాదు..ఇప్పటివరకు రాష్ట్రంలో 300 కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కట్టడి లో భాగంగా ప్రతి ఒక్కరు తమవంతు విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తన కిడ్ బ్యాంకు లో దాచుకున్న డబ్బును విరాళంగా ఇచ్చి కేటీఆర్ ను ఫిదా చేసింది. తాజాగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య వారు రూ. 31 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం అందజేశారు. ఈమేరకు మంత్రి కేటీఆర్ కు చెక్ ను అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.