Site icon TeluguMirchi.com

అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్

ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడుకు మరోసారి ఆపరేషన్ చేశారు. కొద్దికాలంగా అచ్చెన్న ఫిషర్‌తో బాధపడుతున్నాడు. దీనికితోడు ఆసనం సమీపంలో ఏర్పడ్డ చీము గడ్డ పగిలి రక్తస్రావం జరిగింది. దీంతో ఆయనకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో బుధువారం మరోసారి శస్త్రచికిత్స చేసారు.

అవినీతి ఆరోపణల నేపథ్యంలో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ… వైద్యుల సూచన మేరకు ఆయనను ఆస్పత్రికి తరలించింది. అప్పటి నుంచి ఆయన గుంటూరు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు వెంటనే ఆయనకు శస్త్ర చికిత్సచేయాలని నిర్ణయించారు.

Exit mobile version