Site icon TeluguMirchi.com

అచ్చెన్నాయుడు అరెస్ట్..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను పోలీసులు అరెస్ట్ చేసారు. నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించాడని అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది.. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

అచ్చెన్న అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

Exit mobile version