తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ని నియమించాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునే విధంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును అప్పట్లో సామాజిక సమీకరణాల దృష్ట్యా తెరపైకి తెచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గత ఎన్నికల్లో ఓటమి తర్వాత యాక్టివ్‌గా కనిపించడం లేదు. దీంతో అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు పేరు అధ్యక్ష రేసులోకి వచ్చింది .
పార్టీ సీనియర్స్ సైతం అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలనే ఆలోచనకు మద్దతిస్తున్నారు. వాస్తవానికి ఈ పదవికి మొదట .. రామ్మోహన్ నాయుడు పేరు ప్రచారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని క్రమంగా యువత చేతుల్లోకి పంపాలనే ఆలోచనలో భాగంగా… యువకుడైన రామ్మోహన్‌నాయుడుకు చాన్స్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. రామ్మోహన్ నాయుడు.. రాజకీయాలకు అనూహ్యంగా వచ్చినా… మంచి అవగాహనతో… చక్కని వాక్చాతుర్యంతో రాజకీయం చేస్తున్నారు. ఆయనకు మరీ అనుభవం తక్కువ అవుతుందన్న అభిప్రాయం వినిపించడం తో అచ్చెన్నాయుడు కే మొగ్గు చూపిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుందని తెలుస్తుంది.