మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా అచ్చెన్నాయుడు ఉండడం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేగుతోంది.
అచ్చెన్నాయుడు హయాంలోనే ఈఎస్ఐ కుంభకోణం జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు అధికాలు చెబుతున్నారు. టెక్కలిలో ఉన్న అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసులో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.