గవర్నమెంట్ ఆఫీసుల్లో అవినీతికి చెక్, కొత్తగా యాప్ !


ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ‘ACB 14400’ పేరుతో అవినీతి నిరోధక శాఖ కొత్తగా మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ యాప్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫిర్యాదుకు తమ దగ్గరున్న డాక్యుమెంట్లను వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉందన్నారు. ఫిర్యాదు రిజిస్టర్‌ చేయగానే మొబైల్‌కు రిఫరెన్స్‌ నంబరు వస్తుందన్నారు. ఫిర్యాదులను ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని చెప్పారు.