అరంగేట్రంతోనే అదరగొట్టిన ‘ఆమ్‌ ఆద్మీ’!

aam admi partyఅది నిన్న గాక మొన్న పుట్టిన బుడ్డ పార్టీ… అయితేనేం…..? కాకలు తీరిన యోధాను యోధ పార్టీలను యువమంత్రంతో ఊడ్చేసింది. ఊహించని ఫలితాలతో అందరి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. ఇప్పటికే మీకు అర్థం అయిపోయిందనుకుంటా.. అదీ క్రేజీవాల్ సారథ్యంలోని అమ్ ఆద్మీ పార్టీ అని. అరంగేట్రంతోనే అదరగొట్టిన కేజ్రీవాల్‌ పార్టీ విజయ ప్రస్థానానికి దారి తీసిన పరిస్థితులు ఒకటో రెండో కాదు… చాలానే వున్నాయి.

అధికార పార్టీ వైఫల్యాలు మాత్రమే కాదు. అవినీతి, అధిక ధరలు అధికార కాంగ్రెస్ పార్టీ నడ్డిని విరిచాయి. అదే సమయంలో.. జనం పడుతున్న కష్టాలను తీర్చే పార్టీగా తమను తాము ముందుకు తీసుకెళ్లడం కూడా అమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా సఫీలీకృతమయింది. యువమంత్రంతో.. అవినీతిని చీపురుతో వూడ్చేస్తామన్న క్రేజీవాల్ మాటలు ఓటరు మహాశయులను విపరీతంగా ఆకర్షించాయి. మాటలతో చెప్పకుండా చీపురు చేతపట్టి జనంలోకి వెళ్లిన క్రేజివాల్ బృందానికి ప్రజలు జేజేలు పట్టారు. దాని ఫలితమే.. కాకలు తిరిగిన కాంగ్రెస్ కళ్లు బైర్లు కమ్మేలా ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

అవినీతికి వ్యతిరేకంగా మరియు స్థానిక సమస్యలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ చేసిన ఉద్యమాలు ప్రజల్లో చెరదని ముద్ర వేశాయనే చెప్పలాలి. అందుకనే.. రాజకీయాల్లో రాటుదేలిన ఢిల్లీ ముఖ్యమంత్రి శీలా దీక్షీణ్ సైతం.. క్రేజీవాల్ దాటికి నిలవలేకపోయింది. శీలాపై క్రేజివాల్ ఛాలెంజ్ చేసి మరి విజయం సాధించడం విశేషం. శీలాపై 25,864 భారీ మెజారిటీతో క్రేజివాల్ విజయ సాధించాడు. ప్రజలు అవినీతి పరిపాలనను చీదరించుకుంటారనే వాస్తవం ఈ ఎన్నికల ద్వారా అర్థమయింది. అవినీతి ప్రభుత్వాన్ని గద్దించాలనే పట్టుదలతో యువత వుండటం శుభసూచికమే మరి..