Site icon TeluguMirchi.com

ప్రభుత్వానికి సమన్లు జారీ చేస్తాం : సుప్రీంకోర్టు

supremecourtసుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని వివాదాస్పద 26 జీవోలపై దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వమే అప్పట్లో జీవోలను జారీ చేసిన మంత్రులకు న్యాయ సహాయం అందించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు దర్యాప్తు పురోగతిపై సీబీఐ  ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్‌ సుధాకర్‌రెడ్డి అభ్యర్థనపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశాన్ని కేసు విచారణ సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైతే ప్రభుత్వానికి ఈ దిశగా సమన్లు జారీ చేస్తామని పేర్కొంది. ఐఎఎస్. అధికారులు శ్రీలక్ష్మి, ఎస్వీ ప్రసాద్‌ తమకు న్యాయవాదిని పెట్టుకునేందుకు గడువు కావాలని చేసుకున్న అభ్యర్థన మేరకు వారికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది.

Exit mobile version