తెలంగాణ రాష్ట్రంను తీసుకు వచ్చిన మాకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందంటూ చెప్పుకొస్తున్న టీఆర్‌ఎస్ నాయకులను ఉలిక్కిపడేలా చేసింది ఈ సర్వే. ఒక స్వచ్చంద సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో వెళ్లడైన విషయాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు షాక్ ఇవ్వబోతున్నట్లుగా సదరు సర్వేలో వెళ్లడైంది. కాంగ్రెస్‌కు సంపూర్ణ ఆధిక్యంను తెలంగాణ ప్రజలు ఇవ్వాలని భావిస్తున్నారట. ఇది కాంగ్రెస్ పార్టీ సర్వే అని కొంత మంది కొట్టి పారేసినా కూడా ఈ సర్వేలో కొన్ని విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
2014 ఎన్నికలతో పోల్చితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ప్రదర్శణ చేస్తుందని ఆ పార్టీ నాయకులు కూడా చెప్పుకొస్తున్నారు. కాని సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోనుంది అంటూ తేలింది. నల్లగొండ, ఖమ్మం, అదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ తూడ్చుకుపెట్టుకు పోనుందని సర్వేలో వెళ్లడైంది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో 2014తో పోల్చితే బాగా వీక్ అవ్వడం జరిగింది. కరీంనగర్, వరంగల్‌లో మాత్రమే తెరాసా గట్టి పోటీ ఇవ్వగలదని, నిజామాబాద్‌లో కూడా టీఆర్‌ఎస్‌కు ఇబ్బందులు తప్పవని సర్వేలో వెళ్లడైంది. మొత్తానికి ఈ సర్వే తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.