72 గంటల విద్యుత్ సమ్మె.. !

Seemandhra stir secretariatసీమాంధ్రలో సమైక్య సెగ ఇంకా కొనసాగుతూనే వుంది. తాజాగా, సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి 72గంటల సమ్మెకు దిగారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెను చేపడతామని విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే ప్రకటించినప్పటికినీ.. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశమానంతరం సమ్మెను 72గంటలకు కుదించారు. అయితే, రైల్వేలు, ఆసుపత్రులు, త్రాగు నీరు వంటి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాలో అంధకారం అలుముకోనుంది. ఇప్పటికే సీమాంధ్రలో వస్త్ర వ్యాపారులు, దుకాణదారులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూత పడటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.