ఆంధ్రప్రదేశ్ : MLA కోటాలోని 7 MLC స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న మొత్తం 175 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ ఆవరణలోనే జరగనుంది. దీనికి సంబంధించి ECI సూచనల మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. YSRCP మొత్తం 7స్థానాలకు అభ్యర్థులను పోటీకి నిలపగా, TDP ఒక స్థానానికి అభ్యర్థిని పోటీలో నిలిపింది. MLC ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.