కరోనా దెబ్బ కు ఈ ఏడాది విద్యా వ్యవస్థ కుదేల్ అయ్యింది. విద్యార్థుల ఏడాది చదవు వృధా అయ్యింది. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టడం తో మళ్లీ స్కూల్స్ , కాలేజస్ ఓపెన్ అవుతున్నాయి. రాష్ట్రంలో రేపటి నుండి 6,7,8 తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి 1వ తేదీలోగా తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పాఠశాల నిర్వాహకులు కొవిడ్ మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరుకావాలన్న నిబంధనేది లేదని, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.