Site icon TeluguMirchi.com

ఐదోవ రోజు కూడా టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన స్పీకర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గత నాల్గు రోజులుగా వాడివేడిగా సాగుతున్నాయి. అధికారపార్టీ , ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తుండడం తో స్పీకరు వారిని సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. ఐదో రోజు కూడా అదే పనిచేసారు.

ఐదో రోజు 10 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో టిడిపి సభ్యుల ఆందోళన కొనసాగుతున్నది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు టిడిపి సభ్యులు. దీంతో 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి పేర్ని నాని. అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనగాని సత్య ప్రసాద్, ఏలూరు సాంభశివరావు, జోగేశ్వర రావు, రామ రాజు, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామి, అశోక్, బుచ్చయ్య చౌదరి సస్పెన్ష్‌ అయిన వారిలో ఉన్నారు.

Exit mobile version