Site icon TeluguMirchi.com

విజయవాడ అగ్ని ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. చాలామందికి గాయాలు కావడం తో వారికీ చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఈ ఘటనపై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అటు ఈ ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Exit mobile version